పాదయాత్ర విజయవంతం కావాలి

రాయచోటి:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా నేతలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.  చిన్నమండెం జెడ్పీటీసీ కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి తదితరులు తిరుమలకు కాలినడకన బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేందుకు కాలినడకన తిరుమలకు వెళుతున్నామన్నారు. 

Back to Top