పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలి

బుచ్చినాయుడు కండ్రిగ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పిలుపునిచ్చారు. బుచ్చినాయడు కండ్రిగలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల కన్వీనర్ విద్యానాథరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. సత్యవేడు నియోజకవర్గ నేత ఆదిమూలం మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు.  పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో హరినాథరెడి, గురునాథం, సీరాజ్‌బాషా, ఆనంద్‌రెడ్డి, రాథారెడ్డి, భాస్కర్, రాజా తదితరులు పాల్గొన్నారు.

Back to Top