పాదయాత్రకు అనుమతి అవసరం లేదు: సురేఖ

పీలేరు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే పాదయాత్రలకు ఎవరి అనుమతీ అవసరం లేదనీ, ప్రజల ఆదరణే ముఖ్యమనీ ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టీకరించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం పార్టీలు సీబీఐని అడ్డుపెట్టుకుని అరెస్టు చేయించాయని ఆమె విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డికి త్వరగా బెయిలు రావాలని కోరుతూ చిత్తూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 108 మంది మహిళలు మదనపల్లె నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్రను పీలేరు పట్టణ శివారులో  కొండా సురేఖ కలిసి సంఘీభావం తెలి పారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆమె వ్యక్తంచేశారు. పాదయాత్రలో ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి కూడా పాల్గొన్నారు.

Back to Top