పేదల ముఖంలో చిరునవ్వు నింపడమే లక్ష్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సందేశం పంపారు. ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలిపారు. ‘ఆరేళ్లుగా మీరు చూపుతున్న ప్రేమాభిమానాలు, నా తండ్రి ఇచ్చిన ధైర్యంతో పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నాను. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వు నింపాలన్న నాన్నగారి కలను సాకారం చేసేందుకు మరో సంవత్సర దూరంలో ఉన్నాను. మేం చేస్తున్న కార్యక్రమాల ద్వారా మా తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని కలకాలం గుర్తుంచుకుంటారని గర్వంగా చెబుతున్నా’. అని ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

Back to Top