'ఓర్వలేకే వైయస్ కుటుంబంపై నిందలు'

కార్వేటినగరం:

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గొప్ప మానవతావాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పేర్కొన్నారు.  టీడీపీ, కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. జగనన్న మాట కోసం షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక వైయస్ కుటుంబంపై ప్రతి పక్షనేతలు నిందలు మోపుతున్నారన్నారు. వైయస్‌ఆర్ సీపీని కులాలు, మతాలు, పార్టీలు అనే భేదం లేకుండా ప్రజా సంక్షేమానికి పోరాడే పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారని  తెలిపారు. జగనమోహన్‌ రెడ్డిని ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంచితే కాంగ్రెస్, టీడీపీలకు అంత మంచిదిగా భావిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసమే పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జగన్‌తోనే ప్రజలకు సమన్యాయం
కేవీబీపురం: జగన్మోహన్‌ రెడ్డితోనే ప్రజలకు సమన్యాయం సాధ్యమని వైయస్ఆర్‌ సీపీ సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ కోనేటి ఆదిమూలం చెప్పారు. ప్రభుత్వం కుట్రపన్ని జగనన్నను వేధిస్తోందని ఆరోపించారు. ప్రజల నెత్తిన గ్యాస్ భారాన్ని మోపిన కిరణ్‌కు పాలించే అర్హతలేదన్నారు.  వైయస్ఆర్ హయాంలోనే గ్యాస్ ధరలు అదుపులో  ఉండేవని ఆయన పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారనీ, అదే విధంగానే జగన్ కూడా చేస్తారని తెలిపారు.

Back to Top