తుపాన్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ రూ.కోటి సాయం


బాధితులను ఆదుకునేందుకు మరో కమిటీ..
బాధితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలం...
కేవలం ప్రచార్భాటమే తప్ప.. సాయం శూన్యం...
తుపాన్‌ ప్రాంతాల్లో కూడా చంద్రబాబు హెరిటేజ్‌ వ్యాపారం..
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

విజయవాడః తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలమై తినడానికి  తిండిలేక, తాగడానికి నీరులేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.. బాధితులకు సాయంగా వైయస్‌ఆర్‌సీపీ తరపున కోటి రూపాయాలు విరాళం ప్రకంటించారు. ధర్మాన ప్రసాద్‌రావు, విజయసాయి రెడ్డిల ఆ«ధ్వర్యంలో  రెండు కమిటీలు తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయన్నారు. బాధితులను ఆదుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు.  తుపాన్‌ వచ్చి ఐదు రోజులు అవుతున్నా బాధితులను ఆదుకోవడంలో వారికి సాయం అందించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలయ్యిందన్నారు. చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో  ఉన్నారేగాని, ఆయన మనసంతా  ఐటీ దాడులు జరుగుతున్న తమ బీనామీలు సీఎం రమేష్, సుజనా చౌదరిలపైనే ఉందన్నారు. తము దాచుకున్న డబ్బు ఏమైపోతుందోన్న భయం చంద్రబాబులో ఉందన్నారు.అందుకే  దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలపై లేదన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు అన్నమో రామచంద్రా అంటూ తిండి,నీరులేక అష్టకష్టాలు పడుతుంటే.. అవేమి పట్టించుకోకుండా, చంద్రబాబు తమ మేనేజ్‌మెంట్‌ తో ప్రచార్భాటంతో ఏదో సాయం చేస్తున్నట్లుగా  హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారన్నారు. తన అనుకూల మీడియా ద్వారా తిత్లీ పర్యవేక్షణ కార్యక్రమాలు తను దగ్గరే ఉండి  చేస్తున్నాననే  ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో 5 రోజుల నుంచి కరెంటు కూడా లేదని అంధకారంలో ఉన్నాయన్నారు. దీంతో బాధితులు రోడ్లు మీద ధర్నాలు చేసే పరిస్థితి ఉందని,  కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు మనోధైర్యం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం చంద్రబాబులో లేదన్నారు. ప్రజలు కష్టాలతో అల్లాడుతుంటే చంద్రబాబు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారన్నారు. తుపాన్‌ ప్రాంతాల్లో ఏమి కొనుక్కొవాలన్నా విపరీత ధరలు ఉన్నాయని  కోడిగుడ్డు రూ. 10 , టమాటాలు రూ.50, లీటరు పెట్రోలు రూ. 150 ,తాగునీరు కూడా 100 రూపాయలు  పెట్టుకుని కొనుక్కునే పరిస్థితి తుపాన్‌బాధితులను చిత్తశుద్ధితో ఆదుకోవాలన్నారు. చంద్రబాబు పాలన,బీనామీలు అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తుపాన్‌ ప్రాంతాల్లో  హెరిటేజ్‌ కంపెనీ ద్వారా కూడా చంద్రబాబు వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితులు  హెరిటేజ్‌ పాల ప్యాకెట్లు విప్పితే పాలు బదులు నీళ్లు ఉంటున్నాయన్నారు .ప్రచారాలు మాని బాధితులను ఆదుకోవాలన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top