ఏడాది పాదయాత్రకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధం


– ఈ నెల 26వ తేదీ నుంచి ప్రజా ప్రస్థానం ప్రారంభం
నెల్లూరు:  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఏడాది పాటు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టేందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 5.37 గంటలకు నగరంలోని రామలింగాపురం నుంచి 366 రోజుల పాదయాత్ర మొదలుపెడతారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగుతారు. పాదయాత్రలో భాగంగా 150 రోజులు ప్రజల మధ్య పల్లె నిద్ర , 303 చోట్ల సామూహిక సహపంక్తి భోజనాలు, 1,005 చోట్ల ఆత్మీయ సదస్సులు నిర్వహించనున్నట్లు కోటంరెడ్డి వెల్లడించారు. పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు గాను నేటి నుంచి 1,005 మంది మహిళల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top