<img style="width:300px;height:166px;margin:5px;float:right" src="/filemanager/php/../files/News/muslim.jpg">మహబూబ్ నగర్, 25 నవంబర్ 2012: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రకు పాలమూరు ముస్లీం సోదరులు సంఘీభావం తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని ముస్లీం నాయకులు గుర్తు చేసుకున్నారు. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ కే దక్కుతుందన్నారు. ప్రస్తుత పాలకులు తమను పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. <br>మహబూబ్ నగర్ జిల్లాలోని వెంకటాపురం స్టేజీ వద్ద నుంచి ఆదివారం షర్మిల యాత్ర ప్రారంభమైంది. 39వ రోజు కొనసాగుతున్న షర్మిల యాత్రకు ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా జై జగన్.. జై జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది.