వైయస్‌ జగన్‌ను కలిసిన ఎంపీటీసీలు

వైయస్‌ఆర్‌ జిల్లా: సంబేపల్లె మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఎపిటీసీలు, డీసీఎంఎస్‌ సభ్యులు వైయస్‌ఆర్‌సీపీ నేత ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇడుపులపాయలో కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైయస్‌ జగన్‌ను కలసిన వారిలో  ఎంపీపీ జాండ్ల సరస్వతి,   ఎంపీటిసిలు గుది చంద్రయ్య,  లక్షి్మదేవమ్మ, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ‡ ప్రధాన కార్యదర్శిలు  చిదంబర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, డిసిసిడైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, మండల  కన్వీనర్‌ ఉదయకుమార్‌రెడ్డి,  వడ్డి వెంకట్రమణారెడ్డి, వసంత శ్రీనివాసులరెడ్డి, అమరనాద్‌రెడ్డి, వాసుదేవరెడ్డి,వడ్డి వెంకట  సుబ్బారెడ్డి, నాగరాజుయాదవ్, తదితరులు ఉన్నారు. 
 –––––––––––
Back to Top