ఆరోగ్య సమస్యలపై దృష్టిసారించాలి


వైయస్‌ఆర్‌ జిల్లా: తుమ్మలపల్లె యురేనియం ప్లాంట్‌ కారణంగా గ్రామస్తులతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలని ౖÐð యస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి యూసీఐఎల్‌ సీఎండీ హాస్నానిని కోరారు. యూరేనియం చుట్టపక్కల గ్రామాల్లో యూసీఐఎల్‌ సీఎండీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి రైతులకు సంబంధించిన పంట నష్టం, గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను యూసీఐఎల్‌ సీఎండీ హాస్నానికి వివరించారు.  యూరేనియం వ్యర్థాలతోనే ఈ సమస్యలు ఉత్పన్నమైతే తప్పకుండా న్యాయం చేస్తామని సీఎండీ హస్నాన్ని హామీ ఇచ్చారు. సమస్యలపై సైంటిస్టులతో అధ్యయనం చేయిస్తామని, మార్చి 9న మళ్లీ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హాస్నాని తెలిపారు. 
 
Back to Top