<br/><br/>విశాఖ: చంద్రబాబు అవినీతి కారణంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులు సక్రమంగా రావడం లేదని, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అవినీతే అవరోధమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన టీడీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ క్యాబినేట్ సమావేశాల్లో ప్రజా సమస్యలకు బదులుగా భూసేకరణ గురించి మాత్రమే చర్చించారన్నారు. అవినీతి చేయడం ఎలా అన్న అంశంపై ప్రస్తుతం లోకేష్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం రూ.2.26 లక్షల వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఏపీలో అవినీతి ఎక్కువ అని జపాన్ కంపెనీలు చెబుతున్నాయని తెలిపారు.