ప్ర‌భుత్వ తీరుపై ఎంపీ బుట్టా రేణుక అస‌హ‌నం

క‌ర్నూలు) ద‌త్త‌త గ్రామాల అభివృద్దికి తెలుగుదేశం ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌టం లేద‌ని వైయ‌స్సార్సీపీ క‌ర్నూలు ఎంపీబుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం పుల్లగుమ్మిని సందర్శించారు. తాను చేస్తున్న అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మోకాలడ్డడం వింతగా కనిపిస్తోందన్నారు. అభివృద్ధి పట్ల అధికార పార్టీ నాయకులు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.  
 
  ఎంపీ నిధులతో నిర్మిస్తున్న రోడ్లు ముందుకు సాగకపోవడంతో పీఆర్ ఏఈ అచ్యుతానందరెడ్డిని వివరాలు అడిగి తెసుకున్నారు. మరో 30 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు.. ఎన్‌ఆర్‌ఇజియస్‌తో కలిపి మొత్తంగా గ్రామానికి కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఏఈని ఆదేశించారు.

సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్  చెరుకులపాడు నారాయణరెడ్డి, తహసీల్దార్ శారద, ఎంపీడీవో అబ్దుల్ వహీద్, వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకులు బొమ్మన సుబ్బారెడ్డి,  శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top