ప్రజాస్వామ్యం అపహాస్యం

అనంతపురం:   చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్యాంకలకడలు ధ్వజమెత్తారు. శనివారం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి మద్దతుగా ఐటీ విభాగం ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థను ఆసరాగా చేసుకుని చేసే ప్రతి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను, ఉద్యమ నాయకులను వేధిస్తున్నారన్నారు. అధికారంలోకి రాకముందు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి రాగానే ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతిని అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎలాంటి నిరుద్యోగ భృతి అందించలేదన్నారు. గతంలో చేసిన విధంగా ఈసారి అధికారాన్నంత అమరావతి కేంద్రంగా అధికారాన్ని చెలాయిస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతానికి అభివృధ్ది ఫలాలు అందాలంటే ౖవైయస్‌ఆర్‌సీపీతోనే సాధ్యపడుతుందన్నారు. వెన్నపూస గోపాల్‌రెడ్డి ఇక్కడి ప్రాంత అభ్యర్థిగా గతంలో మాజీ సైనికోద్యోగిగా, రాష్ట్ర ఎన్‌జీఓ అధ్యక్షుడిగా, జాతీయ జేఏసీ నాయకుడిగా పనిచేసి నిత్యం సమస్యల పై పోరాటాలు జరిపి విజయవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉంటారన్నారు. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. రాయలసీమ అన్ని విధాలుగా అభివృధ్ది సాధించాలంటే గోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వమే ప్రధానమైనదన్నారు. యువత తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం జాబు రావాలంటే బాబు పోవాలనే భావన ప్రస్తుతం ఏర్పడిందన్నారు. కేవలం రీఎంబర్స్‌మెంట్‌ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు తీరదని వారి భవిష్యత్తుకు భరోసా కావాలన్నారు. అది ఒక ౖవైయస్‌ఆర్‌సీపీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అధోగతిలో ఉన్న నిరుద్యోగులు తమ ఓటు ద్వారా ప్రభుత్వానికి బుధ్ది చెప్పాలన్నారు. 2019 ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరండమని ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీకి తగిన బుధ్ది చెప్పాలన్నారు. అనంతరం వారు నగరంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు, ప్రతాప్‌రెడ్డి, రోశిరెడ్డి, కుమార్, ఉదయ్, భరత్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Back to Top