చిత్తూరు: అలుపెరగని నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అని వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కార్వేటినగర్ కూడలిలో వైయస్ఆర్ క్యాంటీన్‌ను వారు ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రోజాతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజాసంకల్పయాత్రకు ఊహించని మద్దతు లభిస్తోందని, పాదయాత్ర అనంతరం ఢిల్లీలో వైయస్ జగన్‌తో సభ నిర్వహిస్తామని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రజలకు వైయస్ జగన్ ఆశాజ్యోతి అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుంట్ను గుంటనక్కలు ఉన్నారని, వారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న వారి పాలన త్వరలోనే అంతమవుతుందని, వైయస్ జగన్ సీఎం కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.