నాలుగున్నరేళ్లలో మున్సిపల్‌ స్కూళ్లకు ఏం చేశావ్‌

నెల్లూరు: అనుమతులు లేకుండా నారాయణ కళాశాలలు నడుస్తున్నాయని, దొంగ ర్యాంకులు వేసుకుంటున్నారని చెబితే వాటిని రుజువు చేసుకోకుండా పొంతనలేని సమాధానాలు చెబుతూ మంత్రి నారాయణ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. చాలా సంవత్సరాలుగా కాలేజీలు నడుతున్నామని, అది అధికారులు చూసుకుంటారనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజలు నా కాలేజీల్లో చేరుతున్నారు.. నా తప్పేంలేదని మంత్రి చెప్పడం మనీ స్కామ్‌కు పాల్పడినవారు డబ్బులు కట్టారు మోసం చేశాం అన్నట్లుగా ఉందన్నారు. నారాయణ కళాశాలలో దొంగ ర్యాంకులు వేసుకుంటున్నారని ఆధారాలతో సహా చూపిస్తామన్నారు. లక్షల్లో ఫీజులు దండుకుంటూ చదువు పేరుతో పేద ప్రజలను మంత్రి నారాయణ అడ్డంగా దోచుకుంటున్నాడని అనిల్‌ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లలో మంత్రి నారాయణ మున్సిపల్‌ స్కూల్స్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దోపిడీ తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే లేదన్నారు. రాబోయే రోజుల్లో దోపిడీ సొమ్ము ఒక్కో రూపాయి కక్కిస్తామని, తనపై ఛాలెంజ్‌లు చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం ఇస్తానని, అందరి దోపిడీని భయటపడతానని స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top