వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మైనారిటీస్

కదిరి:  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన వంద మంది ముస్లిం కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి ఆధ్వర్యంలో పులివెందులలో టీడీపీ నాయకులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ తీరు నచ్చి ఈ పార్టీలో చేరుతున్నట్లు  ప్రకటించారు. చంద్రబాబు నోట్ల రద్దు, ప్రత్యేకహోదా వంటి విషయాల్లో ఇప్పటికే పలుమార్లు మాట మార్చారని ఈ విషయంలో వైయస్‌ జగన్‌ ఒకే మాటపై ఉన్నారని వారు తెలిపారు. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి వైయస్‌ కుటుంబం అందరి ముస్లింల హృదయాల్లో చోటు సంపాదించుకుందన్నారు.  కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ పట్టణాద్యక్షులు బాహవుద్దీన్, కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, కళ్యాణ్, జగన్, గంగాధర్, రహంతుల్లా తదితరులున్నారు.

Back to Top