దళారులుగా మారి దండుకుంటున్నారు

పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీడీపీ విఫలం
మినుము, ధాన్యం పంటలు రోడ్డుపై పోసి నిప్పంటించిన అన్నదాతలు
టీడీపీకి చెందిన రైతులకే మద్దతు ధర
పట్టిసీమ ఎందుకూ పనికిరాని ఉట్టిసీమగా మారింది
అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ

గుడివాడ: చంద్రబాబు సర్కార్‌లో పంటలకు గిట్టుబాటు ధర లేదని కృష్ణా జిల్లా అంగలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మినుము, ధాన్యంకు గిట్టుబాటు ధర లేదంటూ పంటలను రోడ్లపై పోసి నిప్పుపెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగలూరు రైతులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతలు వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. టీడీపీ వారే దళారులై దోచుకుంటున్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి మినుముల ధర క్వింటా రూ. 14,500, వరి రూ. 1130 ఉందన్నారు. కానీ ఇప్పుడదని సగానికి సగం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలను మార్కెట్‌ యార్డుకు తీసుకొని వెళితే దళారులు టీడీపీ నేతలవే కొంటున్నారన్నారు. టీడీపీ వారే దళారీలుగా తయారై తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా ఉన్న రైతులకు మాత్రమే రూ. 5,400లు క్వింటాకు ధర ఇస్తున్నారన్నారు. మిగిలిన రైతులకు రూ. 4 వేలు కూడా పలకడం లేదన్నారు. 

చంద్రబాబు పాలనలో పంటల్లేవు.. ధరల్లేవు.. పట్టిసీమ దేనికి పనికిరాకుండా ఉట్టిసీమగా మిగిలిపోయిందన్నారు. రైతు పండించిన పంటకు మాత్రం హెరిటేజ్‌ షాపుల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెరిటేజ్‌ షాపులో కేజీ మినుములు రూ. 90కి అమ్ముతున్నారని, అంటే క్వింటాకు రూ. 9 వేలు పడుతుందని, అదే రైతుల వద్ద మాత్రం రూ. 4 వేలకు కూడా కొనడం లేదన్నారు. వరి కనీస మద్దతు ధర రూ. 1530 ఉంటే.. అది కూడా చెల్లించడం లేదన్నారు. ఉన్న కొద్దిపాటి ధరకు పంట అమ్మితే డబ్బులు కూడా సకాలంలో చెల్లించడం లేదని వాపోయారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంట పండించేందుకు సైతం ఆర్థిక చేయూతనందిస్తామని వైయస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top