నెల్లూరు: పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుని కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన మల్లి మస్తాన్ బాబు దేశం గర్వించదగ్గ వ్యక్తి అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. మస్తాన్ బాబు పేరుతో స్మారక మందిరం నిర్మించాలన్నారు. మంగళవారం మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మస్తాన్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. Mastan Babu, from our Nellore, educated at IIT, IIM, breaking records in mountaineering, inspite of his challenging background. 1/2— YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2015ఈరోజు నెల్లూరు జిల్లా గాంధీ సంగంలోని మస్తాన్ బాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. తొలుత మస్తాన్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించినవారిలో ఉన్నారు.His life is an inspiration to us all. 2/2 pic.twitter.com/Av7BB0EwMO— YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2015