మంగళవారం 'మరో ప్రజాప్రస్థానం' 15 కి.మీ.లు

గూడూరు (కర్నూలు జిల్లా) 20 నవంబర్ 2012 : షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం
పాదయాత్ర మంగళవారం 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. కోడుమూరు
నియోజకవర్గం గూడూరు మండలంలో సాగుతున్న పాదయాత్ర నేటి మధ్యాహ్న భోజన
విరామం తరువాత పాణ్యం నియోజకవర్గం పరిధిలోని సల్కాపురానికి చేరుకుంటుంది.  రాత్రి బస చేసిన పెంచికలపాడు శివారు నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర, పెంచికల పాడు, నాగులాపురం, సల్కాపురం, పెదపాడు ద్వారా కర్నూలు
శివార్లలోని సెయింట్ క్లార్క్ స్కూల్ వరకు సాగుతుంది. మంగళవారం రాత్రికి స్కూల్ ఆవరణలో షర్మిల బస చేస్తారు.పార్టీ
ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు
వెంకటరెడ్డి మీడియాకు ఈ వివరాలు తెలిపారు.

Back to Top