మహానేత విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం

గంగారం (ఖమ్మం జిల్లా), 12 మే 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పట్ల తమకు ఉన్న అచంచలమైన అభిమానాన్ని ఖమ్మం జిల్లా గంగారం ప్రజలు స్పష్టంగా చాటుకున్నారు. ఆయన విగ్రహానికి సప్త మూలికా తైలంతో కూడిన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భారీ స్థాయిలో రూపొందించిన మహానేత వైయస్‌ఆర్‌ కటౌట్లను ఊరేగించి, ఆయన పట్ల తమ చెక్కుచెదరని అభిమానాన్ని ప్రదర్శించారు. మహానేత వైయస్‌ఆర్‌ కటౌట్లతో పాటు‌ ఆయన సతీమణి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కటౌట్లను కూడా భారీ ఎత్తున ప్రదర్శించారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఈ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వారు ఊరేగించారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గంగారం వచ్చిన రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలకు గ్రామస్థులంతా ఘనంగా స్వాగతం పలికి పెద్దాయన కుటుంబంపై తమ ప్రేమాభిమానాలనా చాటుకున్నారు. గంగారంలో మహానేత విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులు సుగంధ ద్రవ్యాలతో ఆయన విగ్రహానికి అభిషేకం చేశారు. విగ్రహానికి పూలమాలవేసి శ్రీమతి షర్మిల నివాళులు అర్పించారు.

తాజా ఫోటోలు

Back to Top