మహానేత రైతు బాంధవుడు

శాంతిపురం: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని జెడ్పీ మాజీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని అబకలదొడ్డి పంచాయతీకి చెందిన వెదురుగుట్టపల్లెలో పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.  విద్యుత్తు కోతలు, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీంతోపాటు నిత్యావసర ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదన్నారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని చెప్పారు. మహానేత ఆశయాలను నెరవేర్చగల సత్తా ఆయన కుమారుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. సమావేశంలో సీనియర్ నాయకుడు వెంకటస్వామి, పార్టీ మండల కన్వీనర్ రఘురామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు ఏవీ జయరాం, యువజన విభాగం అధ్యక్షుడు గంగాధరం, మైనారిటీ అధ్యక్షుడు నిసార్, చిన్నప్ప, అనంతరెడ్డి, చలపతి, సంపంగి, రాజమాణిక్యం, రమేష్, ఆంజప్ప, అబ్బులయ్య, బాబు, మనోహర్, మురుగేష్, పి.శ్రీనివాసులు, మునెప్ప, రామకృష్ణ పాల్గొన్నారు.

పార్టీలో చేరిన 42 కుటుంబాలు
వెదురుగుట్టపల్లెలో 42 కుటుంబాల వారు సుబ్రమణ్యంరెడ్డి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. మండల పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు నేతృత్వంలో పార్టీలో చేరిన ముఖ్యులలో అబ్బులయ్య, బాబు, మనోహర్, మురుగేష్, శ్రీనివాసులు ఉన్నారు. పార్టీలో చేరినవారికి సుబ్రమణ్యంరెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

తాజా వీడియోలు

Back to Top