మహానేతపై ఫిర్యాదు చేసిన అంశాన్ని మరిచారా?

హైదరాబాద్, జనవరి 16,2013

: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పై ఫిర్యాదు చేయడానికి గతంలో రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని తెలుగు దేశం నేతలు మరిచారా అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత గోనె ప్రకాశరావు నిలదీశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసిన అంశంపై తెలుగుదేశం నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గోనె ప్రకాశరావు ఘాటుగా స్పందించారు. ప్రజల నిరసనను తెలిపేందుకే విజయమ్మ ఢిల్లీకి వెళ్ళారని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు మోకాళ్ళపై యాత్ర చేసినా జనం నమ్మరన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని చెప్పారు. తాము చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని గోనె ప్రకాశరావు ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలే: భూమన

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో కోట్లాదిమంది సంతకాలు పెట్టారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఈ స్పందన చూసి సహించలేని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ప్రస్తుతం మాదిరిగానే ప్రజలు సార్వత్రిక ఎన్నికలలో కూడా  స్పందిస్తారని స్పష్టంచేశారు. అప్పుడు చంద్రబాబుకు శంకరగిరిమాన్యాలు తప్పవని భూమన పేర్కొన్నారు.

Back to Top