మది..మదిలో...కావాలి జగన్‌–రావాలి జగన్‌

రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. పార్టీనేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి నవరత్నాల పథకాలపై అవగాహన కలిగిస్తున్నారు.నిత్యం ప్రజలతో మేమకమై ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వైయస్‌ఆర్‌సీపీ చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాజన్న బిడ్డ జగనన్న రాజ్యం వస్తేనే మళ్లీ  రాష్ట్ర్రానికి మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. వైయస్‌ జగన్‌పై ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఆయన తనయుడిలో చూసుకుంటున్నామని తప్పక వైయస్‌ఆర్‌సీపీకి అండగా ఉంటామని రావాలి జగన్‌–కావాలి జగన్‌లో ప్రజలు స్వచ్ఛదంగా మద్దతు ప్రకటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా  జి.సిగడాం మండలం టంకాల దుగ్గివలసలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొ్రరెల కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా  కురుపాం మండలం కాకిలి, వలసభలేరు గ్రామాల్లో  ఎమ్మెల్యే పుష్ఫశ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. విశాఖ జిల్లా రాబిల్లి మండలం కుమ్మరాపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ యూవీ రమణమూర్తిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. సుకుమార  వర్మ, లాలం రాంబాబు,బోదెపు గోవింద్, శ్రీనుబాబు,డీఎస్‌ఎన్‌ రాజు, దేసంశెట్టి శంకర్‌రావు,నర్మాల కుమార్, పిన్నాంరాజు వాసు, రాజాన విజయ్, బుల్లబ్బాయ్‌ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.   వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవింద్, చంద్రరావు, పొగడట్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు.  వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయ్, దంగేటి రాంబాబు, బొమ్మి ఇజ్రాయెల్, వంటెద్దు వెంకన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి లంక గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డీనేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. మోహన్‌ రావు, పీకేరావు, మట్టపర్తి శ్రీనివాస్,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top