టీడీపీని భూస్థాపితం చేద్దాం..?

శ్రీకాకుళంః రైతులను, మహిళలను అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న మహానేత దివంగత ముఖ్యమత్రి డా.  వైయస్ఆర్ అని రెడ్డి శాంతి అన్నారు. హీరమండలంలో నిర్వాసితుల సభ వేదిక నుంచి ఆమె మాట్లాడుతూ...బాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ చనిపోయాక 9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నాఒక్క రూపాయి కూడ నిర్వాసితులకు పరిహారం అందిన పాపాన పోలేదన్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పునరావాసం అందిస్తాం, యూత్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రచార ఆర్భాటాల తెలుగుదేశానికి బుద్ధి చెబుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మీ అందరికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పేందుకే వైయస్ జగన్ ఇక్కడకు వచ్చారని రెడ్డి శాంతి తెలిపారు. పాతపట్న నియోజకవర్గంలో వైయస్ఆర్ ఆశీస్సులతో జగన్ అండదండలతో ప్రతీ ఓటరు కలమట వెంకటరమణను గెలిపిస్తే నమ్మకద్రోహం చేశాడని మండిపడ్డారు. అన్నం పెట్టే చేయినే నరికేశాడంటూ కలమటపై నిప్పులు చెరిగారు. నిర్వాసితుల అభివృద్ధి కోసం వెళ్తున్నానని చెప్పి టీడీపీలోకి వెళ్లిన కలమట....ఇసుక దందాలు చేసి కోట్లు సంపాదించుకుంటున్నాడని రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం పనులను, నీరు‍‍చెట్టు, పుట్ట గట్టు అన్నీ తినేస్తున్నాడని దుయ్యబట్టారు. పేదలను ఆదుకోవాలన్న తపన ఉన్న నాయకుడు జగన్ అని రెడ్డి శాంతి పేర్కొన్నారు. టీడీపీ సర్కార్ ను కూల్చేసి...రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top