ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంపై చంద్రబాబు ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. వెలగపూడిలో నిర్మాణాలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఈ పిటిషిన్ వేశారు. పర్యావరణ అనుతులు లోపభుయిష్టంగా ఇచ్చారని పిటిషనర్ శర్మ వాదించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, తదుపరి విచారణ జులై 7కు వాయిదా పడింది<br/>To read this article in English: http://bit.ly/21RcnNs <br/>