వైయస్ జగన్ ను కలిసిన కిడ్నీ బాధితులు..20న కనిగిరిలో పర్యటన

ఈనెల 20న ప్రకాశం జిల్లాకు వైయస్ జగన్
కిడ్నీ బాధిత గ్రామాల్లో పర్యటన

హైదరాబాద్ః

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన కిడ్నీ బాధితులు లోటస్ పాండ్ లో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను కలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కోసారి రూ. 4వేలు ఖర్చవుతోందని, ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదని వాపోయారు. 


ఈనేపథ్యంలో బాధితులకు అండగా ఈనెల 20న కనిగిరిలో వైయస్ జగన్ పర్యటించనున్నారు. గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనడానికి కిడ్నీ బాధితుల ఉదంతమే ఉదాహరణ అని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడం కారణంగా జిల్లాలో 424 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా కనిగిరి, పాలవరం, పీసీ మండల ప్రాంతాలలో వైయస్ జగన్ పర్యటిస్తారని తెలిపారు. 
Back to Top