కరీంనగర్ లో పరామర్శయాత్ర..!

బాధితులకు భరోసా..!
రాజన్న ఆశయాల కోసం కష్టపడుదాం..!
కరీంనగర్ః దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లాలో షర్మిలకు అపూర్వ స్పందన వస్తోంది. చిన్నా, పెద్ద అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ షర్మిల పరామర్శయాత్ర కొనసాగిస్తున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ప్రజలతో మమేకమై సాగుతున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు షర్మిల జిల్లాలో పర్యటిస్తున్నారు. 

సౌజన్యును దత్తత తీసుకున్న షర్మిల..!
కరీంనగర్ లో తొలివిడత యాత్రలో షర్మిల మొత్తం 12 కుటుంబాలను పరామర్శిస్తారు. ఇవాళ గంగారంలో మడక సుశీల కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి సమస్యలు విని చలించిపోయారు. మడక సుశీల కూతురు సౌజన్యను షర్మిల దత్తత తీసుకున్నారు. విలాస్ నగర్ లో కొమురమ్మ కుటుంబాన్ని, కె.కె.నగర్ లో హన్మంతు కుటుంబాన్ని, ఎదురుగట్టులో మద్ది రామస్వామి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు.

రాజన్న కలల కోసం కష్టపడుదాం..!
వైఎస్ షర్మిలకు అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకున్నారు. పేద ప్రజల కోసం పాటు పడిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని షర్మిల అన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని పేర్కొన్నారు.వైఎస్. రాజశేఖర్ రెడ్డి  ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కష్టపడి ...మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని ఈసందర్భంగా షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

Back to Top