ఆక్వా ఘటనపై ప్రభుత్వ తీరు దారుణం

ఏపీ అసెంబ్లీః ఆక్వాఫ్యాక్టరీలో ఐదుగురు చనిపోయినా కూడ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని పట్టించుకోకుండా, దానిపై చర్చ జరపకుండా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఘటన జరిగిన వెంటనే మా నాయకుడు వైయస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించారని, ముఖ్యమంత్రి ఇప్పటికి కూడ వాళ్లను పట్టించుకోవడం లేదని అన్నారు.  రాష్ట్ర ప్రజలంతా సీఎం తీరును గమనించాలన్నారు.

Back to Top