కార్యకర్తలతో కిటకిటలాడిన ప్రధాన కార్యాలయం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గురువారం నాడు కార్యకర్తలు పోటెత్తారు. నేతలతో వారు కార్యాలయానికి విచ్చేశారు. 'జగన్ కోసం జన సంతకం' కార్యక్రమంలో పాల్గొనడానికి వీరంతా ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల కోరుతూ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, ఎస్.వి. సుబ్బారెడ్డి, పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు రెహ్మాన్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  కోటి సంతకాలు సేకరించిన అనంతరం రాజకీయ కుట్రతో శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఏరకంగా జైలులో ఉంచిందీ వివరిస్తూ , ఎలా వేధిస్తున్నదీ పేర్కొంటూ సంతకాలతో పాటు లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేస్తారు.

Back to Top