<strong>నాగార్జునసాగర్ :</strong> కుమ్మక్కు, కుళ్ళు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టిడిపి నాయకులు ఆటలు సాగనివ్వబోమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. 2014లో రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగిస్తామన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో నిర్బంధించి 200 రోజులు కావస్తున్నా బయటకు రానివ్వకుండా కాంగ్రెస్, టిడిపి నాయకులు సిబిఐని వాడుకుని అడ్డుకుంటున్నారని విమర్శించారు.<br/>వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని పార్టీ చేపట్టిన కోటి సంతాకాల సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నదని ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు.<br/>రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని పుత్తా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఆపలేరన్నారు.