కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. ఈ విషయంపై రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రం దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు.<br/><br/>రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ఆర్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వం వహిస్తే వైఎస్ఆర్ సీపీ మద్ధతు పలుకుతుందని స్పష్టంచేశారు.