<br/><br/>అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్‌తో వైయస్ఆర్‌సీపీ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి చేతికి గాయమైంది. మహిళా కానిస్టేబుల్ లేకుండానే పద్మావతిని అరెస్టు చేసి గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ రాంప్రసాద్ ర్యాష్ డ్రైవింగ్‌తో పద్మావతి చేతికి గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తరలించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసుల వైఖరికి నిరసనగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. యామిని బాల అవినీతికి పాల్పడ్డారని పద్మావతి ఆరోపించారు. సాగునీరు ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారని, బహిరంగ చర్చకు రాకుండా యామినిబాల పారిపో్యారని విమర్శించారు. అక్రమాలు బయటపెడితే తనను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. <br/>శింగనమల నియోజకవర్గంలో గత నాలుగేళ్ల పాలన, టీడీపీ నేతల అవినీతిపై వైయస్ఆర్‌సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాలతో చర్చించేందుకు నార్పల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జొన్నలగడ్డ పద్మావతిని ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి అరెస్ట్‌ను నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. మరోవైపు పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు.