జనహృదయాలలో గూడు కట్టుకున్న వైయస్ఆర్

ప్రత్తిపాడు:

రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం రానుందని పార్టీ నియోజకవర్గ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు స్పష్టంచేశారు. పార్టీలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుతుండడమే దీనికి నిదర్శనమన్నారు. ప్రత్తిపాడు మండలం వాకపల్లికి చెందిన సుమారు 200 మంది పార్టీలో చేరిన సందర్భంగా కృష్ణుని గుడి వద్దజరిగిన సభలో వరుపుల ప్రసంగించారు. పేదల సంక్షేమానికి అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన రాజశేఖరరెడ్డి జనహృదయాలలో నిలిచిపోయారని కొనియాడారు. డీసీసీబీ డెరైక్టర్ ముదునూరి మురళీకృష్ణం రాజు, అన్నవరం దేవస్థానం మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు బుద్దరాజు గోపీరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిని వరుపుల కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

విలువలే వైఎస్సార్ సీపీ పునాదులు

అడ్డతీగల : విలువలతో కూడిన రాజకీయాలే పునాదిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోందని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ చెప్పారు. రంపచోడవరం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వందమంది అనుచరులతో సహా పార్టీలో చేరారు. ఉదయభాస్కర్ స్వగ్రామం ఎల్లవరంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాజన్న రాజ్యం సాధించుకోవడానికి కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలన్నారు. రంపచోడవరం మండలానికి చెందిన శారపుఅక్కమ్మ, బాపనమ్మ తల్లి గుడి పాలకవర్గ సభ్యులు బందం పోతన్నదొర, ముసురుమిల్లి మాజీ సర్పంచ్ కుంజం గంగరాజు, వీటీడీఏ మాజీ చైర్మన్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఉదయభాస్కర్ వారికి పార్టీకండువాలు కప్పి ఆహ్వానించారు. మంగరౌతు వీరబాబు, మందపాటి కిశోర్, ఎలిశెట్టి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top