<strong>కుప్పం (చిత్తూరు జిల్లా) :</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వెంటే తామంతా నడుస్తామని కుప్పంలోని ఆర్ఎస్‌పేట మైనారిటీ సోదరులు ప్రతిజ్ఞ చేశారు. ప్రకాశం వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా మైనారిటీ ఆర్గనైజర్ అయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో కుప్పం నాయకుడు, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డి సమక్షంలో సోమవారం సుమారు వంద మంది ముస్లింలు పార్టీలో చేరారు.<br/>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్యులలో మున్వర్, షఫీ, సంధాని, షౌకత్, కరీం, అస్ఘర్, షాబు, ఆదిల్, రజఖత్‌ఖాన్, అమీన్, మూనుష్, అత్తాహర్, ఇషాక్, చోటు, యాసిన్, ఇక్బాల్, పుజల్, సోను, ఆఖిబ్, పైరోజ్, పాపు, కబీర్, నూరుబాయ్, నూరుల్లా, రజా, ముబారక్, సైఫ్, కాశిప్ కలీం, ఖాజీం ఉన్నారు. వారిని సుబ్రహ్మణ్యంరెడ్డి పూలమాలలు, పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.