జగన్మోహన్ రెడ్డి మేలు కోసం సర్వమత ప్రార్థనలు


హైదరాబాద్, 21 డిసెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు.  వృద్ధులకు దుప్పట్లు, పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలని సర్వమత ప్రార్థనలు చేశారు. వైయస్ఆర్ జిల్లాలో పార్టీ శ్రేణులు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు వృద్దాశ్రమాల్లో అన్నదానం నిర్వహించారు.
    
     విశాఖపట్నంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.  వికలాంగులకు వీల్‌చైర్‌లు అందజేశారు. వృద్ధులు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పార్టీ కార్యకర్తలు కేక్ లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ పలు ఆలయాలు, మసీదులు, చర్చీల్లో ప్రార్థనలు చేశారు.

Back to Top