నెల్లూరు, 27 సెప్టెంబర్ 2012: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ మేకపాటి ఈ పాదయాత్ర ప్రారంభించారు. నగరంలోని తన స్వగృహం నుంచి వేదగిరి లక్ష్మీనర్సింహస్వామి కొండ వరకు ఆయన పాద్రయాత్ర 20 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.<br/>పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అధికార, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.<br/>పాదయాత్రకు జిల్లా నలు మూలల నుంచీ వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా కన్వీనర్ కాకాని గోవర్దన్‌రెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు గోపాల్‌రెడ్డి తదితరులు మేకపాటితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.<br/>కాగా, పాదయాత్రలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏర్పాట్లను ఎంపీ మేకపాటి స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.