జగన్ కోసం కురుమూర్తిస్వామి ఆలయంలో పూజలు

చిన్నచింతకుంట (మహబూబ్‌నగర్‌ జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ శ్రీ కురుమూర్తిస్వామి ఆలయంలో వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాలమణెమ్మ, మండల కన్వీనర్ సత్యనారాయణగౌ‌డ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివంగత‌ మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా మేలు జరగాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం కురుమూర్తి ఎం.బి. చర్చిలో ప్రత్యేక పార్థనలు చేశారు.‌ శ్రీ జగన్ కుటుంబ సభ్యులకు ప్రభువు అండగా ఉంటూ, ప్రభుత్వ కుట్రల నుంచి రక్షించాలని ‌ఫా‌దర్ జయనంద్ ప్రార్థన చేశారు.

అనంతరం బాలమణెమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసిన‌ మహానేత వైయస్‌ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులు పెట్టి శ్రీ జగ‌న్‌ను అక్రమంగా జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబం కోసం అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దేవదానం, కృష్ణమూర్తి, వెంకటేశ్‌గౌడ్, వెంకటేశ్‌యాదవ్, మనోహ‌ర్, మన్యం, రామ‌న్‌గౌడ్, సురే‌ష్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
Back to Top