జగనన్న వస్తే బీడీ కార్మికుల కష్టాలు తీరుతాయి

చిన్న చింతకుంట (మహబూబ్ నగర్ జిల్లా), 1 డిసెంబర్ 2012: 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల శనివారం నెల్లికొండ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి గ్రామ ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నామని, అయినా తమ కడుపు నిండటంలేదని బీడి కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రస్తుత పాలకుల నిర్వాకం వల్ల పెరిగిన ధరలతో తామీ కష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. బీడీ కార్మికులకు రుణాలు కూడా ఇవ్వడంలేదని వారు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు.

     కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల అన్నారు. జగనన్నబయటకు వచ్చి రాజన్న రాజ్యం తీసుకు వస్తారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలన్నీ తీరుతాయని, బీడీ కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.  

      వైయస్ఆర్ కడప జిల్లాలో అక్టోబర్ 18న శ్రీమతి షర్మిల ప్రారంభించిన పాదయాత్ర కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలో 45వ రోజు కొనసాగింది. పాలమూరు జిల్లాలో శనివారం తొమ్మిదో రోజు  ఆమె 18.6 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు శ్రీమతి షర్మిల 624.6 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. రాత్రికి నెల్లికొండి గ్రామ శివారులో షర్మిల బస చేశారు.

Back to Top