స్వస్థలం పులివెందులలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు రోజుల పాటు ఉండబోతున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరాము స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకుంటారు. అభిమానులతో కలిసి అక్కడ స్వామి వారిని దర్శించుకోనున్నరాఉ. మధ్యాహ్నం 12 గంటలకు కమలాపురంలో జరిగే దర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 3.00 గంటలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను వైఎస్ జగన్ సందర్శించనున్నారు. అనంతరం నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకును పరిశీలించనున్నారు. శనివారం పులివెందులలోని క్యాంపు క్యారాలయంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.