ప్రతిపక్షనేత అంతానికి పెద్ద కుట్ర..


విచారణ పక్కదారి పట్టిస్తున్న టీడీపీ 
పోలీసులు, టీడీపీ నేతల తీరుపై అనుమానాలు...
రెస్టారెంట్‌ యాజమానిపై విచారణ చేపట్టాలి..
వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాస్‌..

విజయనగరంః రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే  ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అంతం చేయడానికి  పెద్దకుట్ర జరిగిందని తేటతెల్లమవుతోందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మజ్జి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హత్యాయత్నం జరిగిన గంట నుంచి టీడీపీ నేతలు వ్యవహార శైలీ, పోలీసుల తీరు పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు.విచారణ పక్కదారి పట్టించడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్‌ యాజమాని, టీడీపీకి చెందిన  హర్షవర్దన్‌ ప్రసాద్‌ను ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగినప్పటి నుంచి రెస్టారెంట్‌ యాజమానిని  విచారణ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేవలం సాక్షిగా తీసుకున్నారే తప్ప విచారణ చేయలేదన్నారు. సిఎస్‌ఎఫ్‌ అధికారులు రెస్టారెంట్‌ భద్రత మాది కాదంటున్నారని ఆ రెస్టారెంట్‌లోకి ఆ ఆయుధం ఎలా వచ్చింది..ఆ రెస్టారెంట్‌ యాజమానిని అదుపులోకి తీసుకుని జిల్లాలో ఎవరెవరితో టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో విచారణ చేయాలన్నారు.  నిందితుడు బ్యాంకు ఖాతాల్లో భారీమొత్తంలో నిధులు వచ్చాయని వార్తలొచ్చాయన్నారు. అదేవిధంగా ఈ నెలల క్రితం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల ద్వారానే  నిందితుడు శ్రీనివాస్‌ రెస్టారెంట్‌లో ఉద్యోగంలోకి చేరినట్లు తెలుస్తుందన్నారు. నిందితుడు 9 సెల్‌ఫోన్లు మార్చడని, వేలాది ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడని పోలీసులే చెప్పుతున్నారన్నారు. ఈ పరిణామాలన్నీ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయన్నారు.
Back to Top