ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు..!

శ్రీహరికోటః భారత అంతరిక్ష పరిసోధన సంస్థ (ఇస్రో) మొట్టమొదటిసారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్ఎల్వీ సీ 30 ప్రయోగం విజయవంతమైంది. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో సైంటిస్టులు మరెన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 
పీఎస్ఎల్వీసీ 30 ఉపగ్రహం ఈఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈఉపగ్రహ వాహన నౌక ద్వారా 1,513 కిలోల బరువున్న ఆస్ట్రోశాట్ ను పంపించారు. విశ్వంలోని సుదూరు పదార్థాలను అధ్యయనం చేయడానికి ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇది. ఈశాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు. ఖగోళ పరిశోధనల కోసం భారత శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎనలేనిదని వైఎస్ జగన్ అభినందించారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం దాగుందని జగన్ పేర్కొన్నారు.
Back to Top