టీడీపీలో కలవరం..భయాందోళనలో బాబు

()ఓటుకు కోట్లు కేసుపై విచారణ వేగవంతం
()సెప్టెంబర్ 29లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశం
()చంద్రబాబును ముద్దాయిగా చేర్చే విషయంపై కసరత్తు

హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు.  ఈ కేసులో ఏవిధంగా ముందు కెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 29లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సమావేశమయ్యారు. కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా అందడంతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చే విషయంపై కసరత్తు జరుపుతున్నారు. 


మరోవైపు ‘ఓటుకు కోట్లు’ కేసు పునర్విచారణతో  టీడీపీలో కలకలం మొదలైంది.  కేసులో నిందితులుగా ఉన్నవారిని శిబిరాలకు తరలించే కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది.  పొరుగు రాష్ట్రాలకు వీరిని పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు విచారణకు సిద్ధమవ్వడంతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ  జరిపిన వ్యవహారమంతా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పేరును చార్జిషీట్‌లో దాదాపు 33 సార్లు ప్రస్తావించింది. అంతేకాదు ఈ కుట్రకు ఎలాంటి వ్యూహం రచించింది... ఎవరెవరు పాత్రధారులు, సూత్రధారులనే విషయాన్ని స్పష్టం చేసింది. రూ.150 కోట్ల కుంభకోణం కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి న్యాయస్థానానికి అందించిన నివేదికలో ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. దాదాపు 25 పేజీలతో కూడిన నివేదికను న్యాయస్థానానికి ఏసీబీ అందజేసింది. 

ఆతర్వాత చంద్రబాబు కేసీఆర్ తో చేసుకున్న లోపాయికారి ఒప్పందంతో కేసు నీరుగారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. బాబు ఉన్నపళంగా  హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం కూడా మార్చారు. దీనిపై ఎమ్మెల్యే ఆర్కే అన్ని సాక్ష్యాధారలతో ఏసీబీ  కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈకేసులో విచారణ సరిగా జరగలేదని, పునర్విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 


తాజా వీడియోలు

Back to Top