వైయస్‌ జగన్‌ను కలిసిన ఐకేపీ యానిమేటర్లు


కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.  ఆర్‌.కృష్ణాపురం గ్రామం నుంచి వైయస్‌ జగన్‌ 9వ రోజు పాదయాత్ర ప్రారంభం కాగా పెద్ద కోట కందుకూరు మీదుగా పాలసాగరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యానిమేటర్లు జననేతను కలిసి తమ సమస్యలు వివరించారు. తమకు కనీస వేతనం ఇవ్వడం లేదని, వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వారు వాపోయారు.
 
Back to Top