తూ.గో. జిల్లాలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

తూర్పుగోదావరి (ఏలేశ్వరం) : జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వైయస్సార్సీపీలో చేరుతున్నారు. యర్రవరంలో పర్వత పూర్ణచంద్రప్రసాద్ సమక్షంలో గ్రామ ఉపసర్పంచ్‌ దాసరి రమేష్, సహకార సంఘ ఉపాధ్యక్షుడు నీరుకొండ అర్జునరావు, మాజీ ప్రజాప్రతినిధులు భీశెట్టి అప్పలరాజు, రామిశెట్టి వెంకటరమణ, తోట పెద్దిరాజు, బుద్ద లోవబాబుతో పాటు సుమారు వంద మందికి పైగా వైయస్సార్‌సీపీలో చేరారు. అనంతరం ప్రసాద్‌ మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అమలు కాని హామీలతో గెద్దెనెక్కిన బాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజన్న పాలన రావాలంటే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ను సీఎం చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య , మండల కన్వీనర్‌ బెహరా దొరబాబు, సామంతుల సూర్యకుమార్, ఇజనగిరి ప్రసాద్, సామంతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top