సత్య నాదెళ్లకు చంద్రబాబు స్ఫూర్తిఎలా ఇచ్చారు..బుగ్గన

హైదరాబాద్)
మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల కు స్ఫూర్తిని ఇచ్చింది తానే అని చంద్రబాబు
చెప్పుకోవటం హాస్యాస్పదం అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సత్య నాదెళ్ల
1988 లో ఇంజనీరింగ్ పూర్తి చేశారని, తర్వాత అమెరికా వెళ్లి అక్కడే పోస్టు
గ్రాడ్యుయేషన్ చేశారని వివరించారు. అనంతరం 1992 లోనే మైక్రోసాఫ్ట్ సంస్థ లో
ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. అటువంటప్పుడు 1999 లో రెండోసారి
ముఖ్యమంత్రి అయ్యాక ఐటీ జపం మొదలెట్టిన చంద్రబాబు ఏ విధంగా స్ఫూర్తి దాయకం
అవుతారని బుగ్గన రాజా నిలదీశారు. ఆయన కష్టార్జితంతో, ఆయన స్వశక్తితో ఎదిగిన
వ్యక్తి తో ఎదిగారని, ఆయన్ని టీడీపీ వెబ్ సైట్ లో పెట్టేసుకొని తన ఖాతాలో
వేసుకోవటం తగదని అన్నారు.

ప్రపంచంలో
ఏది మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవటం, లేదంటే ఎదుటివారి నెత్తిన రుద్దేయటం
చంద్రబాబుకి అలవాటని బుగ్గన రాజా అభివర్ణించారు. ఇప్పటికైనా టీడీపీ తమ తప్పును
అంగీకరించాలని హితవు పలికారు. అంతమంది తన కారణంగా ఇన్ స్పైర్ అయ్యారని చంద్రబాబు
చెబుతారని, కానీ వాళ్లెవరూ ఆయన పేరు చెప్పుకోలేదని గుర్తు చేశారు. ఇటువంటి గొప్పలు
తగవని బుగ్గన రాజా చెప్పారు 

Back to Top