రూ.2లక్షల కోట్లు ఎలా సంపాదించారు బాబు

న్యూఢిల్లీ : సస్పెన్షన్పై డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
 
కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు. అవినీతిరహిత పాలన అంటూనే చంద్రబాబు నాయుడు, లోకేశ్ అడ్డంగా దోచుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. ఆ డబ్బులతోనే తండ్రీకొడుకులిద్దరూ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారని రోజా సూటిగా ప్రశ్నించారు.
Back to Top