ఏపీలో హిట్లర్ పాలన

విశాఖపట్నంః ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు విమర్శించారు. ఐవైఆర్ లాంటి వారినే తొలగిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా చంద్రబాబు దగ్గర బానిసలుగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్లు తెరవాలన్నారు. ఎక్సైజ్ పాలసీలో రూ. లక్షలు చేతులు మారుతున్నాయని అన్నారు. ఎక్సైజ్ పాలసీని ఐదేళ్లకు తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వైయస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి జవహర్ వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.

Back to Top