హైదరాబాద్ః రోజా సస్పెన్షన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధికార దురహంకారానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందని ఉప్పులేటి కల్పన చెప్పారు. రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఆమె స్పందించారు. టీడీపీ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. <br/>వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేసినా, ఇతర ఇబ్బందులు పెట్టినా .... నిమ్మకునీరెత్తినట్లు ఉంటారనుకుంటే పొరపాటని, జడిసే సమస్యే లేదని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే స్వభావం వైఎస్సార్‌సీపీ సభ్యులదని ఆమె పేర్కొన్నారు. రోజా ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వహిస్తారని, ప్రజల సమస్యలపై తాము అసెంబ్లీలో టీడీపీని నిలదీస్తామన్నారు. <br/>