– ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన– వైయస్ జగన్‌కు బాధలు చెప్పుకుంటున్న ప్రజలు– అధికార పార్టీ దౌర్జన్యాలపై ఆవేదన
శ్రీకాకుళం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టెక్కలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. కొత్తపేటకు చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. జననేతకు పార్టీ శ్రేణులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. అధికార పార్టీ దౌర్జన్యాలపై స్థానికులు ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. తమ వేదనలు వినే నాయకుడొచ్చాడంటూ ప్రజలు మురిసిపోతున్నారు.
వైయస్ జగన్‌ను కలిసిన యలమంచిలి ప్రజలుప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్‌ను యలమంచిలి సర్పంచ్, గ్రామస్తులు కలిశారు. తాము వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులమన్న సాకుతో మంత్రి అచ్చెన్నాయుడు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. యలమంచిలి గ్రామంలో చాలా మందికి పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు, రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారని జననేత దృష్టికి తీసుకొచ్చారు. సరుగుడు తోటలను తగలబెట్టించారని కోటబొమ్మళి వాసి శ్రీను తెలిపారు. వైయస్ జగన్ సీఎం అయితే మంచి రోజులు వస్తాయని ఆశాభావంం వ్యక్తం చేశారు.