ఎమ్మెల్యే వనితకు ఘన స్వాగతం

గోపాలపురం, 12 జూన్ 2013:

అనర్హతా వేటుకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనితకు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనర్హత ప్రకటన తర్వాత ఆమె మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. దీంతో కార్యకర్తలు ఊరేగింపుగా చిన్న వెంకన్న ఆలయం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆమె దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడినుంచి ర్యాలీగా ద్వారాకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లిలో పర్యటించారు. పదవి లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి  పోరాడతానని వనిత తెలిపారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆమె వెల్లడించారు.

Back to Top